Friday, December 27, 2024

బాలికపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

మైనర్ బాలికపై ముగ్గురు సహచర విద్యార్థులు సామూహిక అ త్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. పట్టణంలోని నేతాజీనగర్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థినిపై ఆమెతోపాటు చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సామూహిక అత్యాచారాని కి పాల్పడ్డారు.

తనపై జరిగిన అఘాయిత్యం గు రించి బాలిక సోమవారం రాత్రి తన తల్లికి చెప్ప గా ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిం ది. ఈ మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశామని ఎసిపి వాసాల సతీష్ తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన విద్యార్థులు బాధిత బాలిక నివసిస్తున్న కాలనీకి చెందిన వారిగా గుర్తించామని అన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News