Wednesday, January 22, 2025

యడియూరప్పపై పోక్సో కేసు

- Advertisement -
- Advertisement -

ఒక 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ యడియూరప్పపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న ఒక సమావేశంలో తన కుమార్తెపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో ఆరోపించారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టంలోని సెక్షన్ 8, ఐపిసిలోని సెక్షన్ 354ఎ కింద యడియూరప్పపై కేసు నమోదు చేసినట్లు సదాశివనగర్ పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఇప్పటి వరకు వివిద వ్యక్తుల పైన 50కి పైగా ఫిర్యాదులు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బెంగఠూరు మాజీ పోలీసు కమిషనర్‌అలోక్ కుమార్, ఆయన సిబ్బంది తనపై దౌర్జన్యం చేశారని, తనను దూషించారని కూడా ఆమె గతంలో ఫిర్యాదు చేశారని వారు తెలిపారు.

అలోక్ కుమార్‌పైన 2021 జనవరి 29న, 2022 సెప్టెంబర్ 21న రెండుసార్లు ఆమె ఫిర్యాదు చేశారని, తన జీవితాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ రిటైర్డ్ బెంగళూరు పోలీసు కమిషనర్, బిజెపి నాయకుడు భాస్కర్ రావుపైన 2022 జనవరి 18న ఆమె ఫిర్యాదు చేశారని వర్గాలు తెలిపాయి. కాగా.. తన తల్లితో పాటు యడియూరప్పను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లినపుడు ఆ బాలిక తీసినట్లుగా భావిస్తున్న రెండు వీడియోలో ఊడా బయటకు వచ్చాయి. యడియూరప్పను అప్పాజీ అని సంబోధిస్తూ బాలిక తల్లి తాము శివముగ్గ(యడియూరప్ప సొంత జిల్లా) నుంచి వచ్చామని చెప్పడం ఒక వీడియోలో కనిపించింది. తమకు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని, అయితే అవి లిటిగేషన్‌లో చిక్కుకున్నాయని, ఆ విషయంలో తమకు సాయపడాలని ఆమె యడియూరప్పను కోరడం వీడియోలో కనిపించింది. మరో వీడియోలో యడియూరప్ప ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఆ మహిళ యడియూరప్ప పక్కన కూర్చుని యన చేతిని పట్టుకోవడం కనిపించింది.

దీనిపై యడియూరప్ప స్పందిస్తూ ఆ మహిళ తనను కలవడానికి ప్రయత్నించిందని, అయితే తాను ఆమెను తన ఇంట్లోకి అనుమతించలేదని చెప్పారు. ఒకసారి ఆమె ఏడుస్తుండడంతో ఆమెను ఇంట్లోకి పిలిచి ఆమెకు అఏదో అన్యాయం జరిగిందన్న విషయాన్ని పోలీసులు కమిషనర్ బి దయానందకు ఫోన్ చేసి చెప్పానని యడియూరప్ప తెలిపారు. అయితే తన ముందే తనకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతుంటే ఈ మహిళ సరైన వ్యక్తి కాదు అని తాను నిర్ణయానికి వచ్చానని ఆయన తెలిపారు. పోలీసు కమిషనర్‌ను కలుసుకున్న తర్వాత ఆమె ఈ వ్యవహారాన్ని మార్చివేసిందని యడియూరప్ప చెప్పారు. తనపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. చట్టపరంగా ఏమి చేయాలో అది చేస్తానని, అయితే ఎవరికైనా సాయపడాలని ప్రయత్నిస్తే ఇదే జరుగుతుందని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News