Thursday, January 23, 2025

30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ

- Advertisement -
- Advertisement -
ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
అదే రోజున అసిఫాబాద్ జిల్లా కలక్టరేట్‌ను, జిల్లా ఎస్‌పి
కార్యాలయాన్ని ప్రారంభించనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదేరోజు (జూన్ 30)న సిఎం కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎంఎల్‌ఎలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు. కాగా….ఈనెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈనెల 30 తేదికి మార్చవలసి వచ్చింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి శుక్ర, శనివారాలలో జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు నిర్వహస్తుండడం, అదే సందర్భంలో ఈ నెల 29వ తేదీన బక్రీద్ పండుగ కూడా వుండడం…వీటన్నిటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీకి మార్చారు. అదేరోజున నూతనంగా నిర్మితమైన అసిఫాబాద్ జిల్లా కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్‌పి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News