Saturday, November 16, 2024

పోడు భూముల సమస్య… దరఖాస్తుల స్వీకరణకు విధివిధానాలు

- Advertisement -
- Advertisement -

Podu bhumula applications received

హైదరాబాద్: తెలంగాణలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు ఈ విషయంలో విధి విధానాలు నిర్ణయించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సి.సి.ఎఫ్. శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమీషనర్ శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా, తెలంగాణా టెక్నాలాజికల్ సర్వీసెస్ ఎం.డి. వెంకటేశ్వర్ రావు తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సి.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడారు. అక్టోబర్ మూడో వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని సి.ఎం. కెసిఆర్ ఆదేశించారని తెలిపారు. ఇందుకు గాను దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, దరఖాస్తులో పొందు పరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినెట్స్ నిర్ణయం, వివిధ స్థాయుల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్సర్వేటర్లు, డి.ఎఫ్.ఒ లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News