Sunday, November 24, 2024

పోడు ఘర్షణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/సత్తుపల్లి: ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మం డల పరిధిలోని రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీ చంద్రాయపాలెం, బుగ్గపాడు గ్రామాల గిరిజనుల మధ్య ఆదివారం అటవీ పోడు భూముల వివాదం ఉద్రిక్తంగా మా రింది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సిఐ కిరణ్ సం ఘటనా స్థలానికి నలుగురు కానిస్టేబుళ్లతో వెళ్లారు. రెం డు గ్రామాల గిరిజనులను సమన్వయపరిచి సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఉన్న పోలీసులపై రెండు వర్గాల గిరిజనులు దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఉన్న గిరిజనులు కర్రలతో దాడికి ఉపక్రమించడంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులకు గాయాలయ్యాయి. రెండు గ్రామాల గిరిజనులు పోలీసులపై పిడి గుద్దులు కురిపించారు. సాధారణ వివాదంగా భావించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని భావించిన పోలీసులపై దాడి జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాగా, దాడి జరిగిన అటవీ ప్రాంతానికి అదనపు సిబ్బందితో మరోసారి వెళ్లేందుకు పోలీసులు సమా యత్తమవుతున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సంఘటనపై ఆరా తీసినట్టు తెలిసింది. పోడు భూముల వ్యవహారంపై చంద్రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం నిరసన వ్యక్తం చేశారు. అటవీ అధికారులతో కలిసి పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని, వాటిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంతలోనే రెండు వర్గాల గిరిజనులు ఆదివారం దాడులకు పాల్పడటం పట్ల పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలిసింది. పోలీసులపై దాడికి పాల్పడిన వారిలో 30 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News