హైదరాబాద్ : పోడు భూముల పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు 4 లక్షల ఎకరాలకు త్వరలోనే పట్టాలు ఇవ్వనుంది. భవిష్యత్తులో అటవీ ఆక్రమణల కు ఆస్కారం లేకుండా అఖిలపక్ష సమావేశాలు ని ర్వహించి అటవీప్రాంత నాయకుల నుంచి హామీ తీసుకొనుంది. ఆ తరవాత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబాబాద్ లేదా ఆదిలాబాద్ జిల్లా నుంచి స్వయంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సమీకృత కొత్త సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తరవాత ము ఖ్యమంత్రి కెసిఆర్ పోడు భూములకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేసిన విషయం విధితమే. అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల్లో అర్హులైన వాళ్లకు రాష్ట్ర ప్రభు త్వం త్వరలోనే పట్టాలు అందజేయనున్నది. ఇప్ప టి వరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు వివి ధ స్థాయిల్లో సభలు, సమావేశాలు నిర్వహించి పరిశీలించిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం నిబంధనలకు లోబడి 360 కోణంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సుమారు 4 లక్షల దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించింది.
నిర్దిష్ట గడువుకు ముందు వరకు భూమిని సాగు చేస్తున్న వాళ్ల దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. పట్టా పొందడానికి అర్హత సంపాదించాలంటే దరఖాస్తుదారు 2005 వరకు మూడు తరాలుగా పోడు చేస్తున్నట్లు ఆధారాలు చూపాల్సి ఉం టుంది. అంటే సదరు వ్యక్తి 2023 వరకు 93 ఏళ్ల పాటు భూమిని సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. క్షేత్ర పరిశీలన కోసం అధికారులు గూగుల్ మ్యాప్ సహా అన్ని రకాల మా ర్గాల్లో పరిశీలనలు సాగించారు. గతంలో పట్టాలు పొందిన వాళ్లను, అర్హత లేని, సరైన ఆధారాలు లే ని వాళ్ల దరఖాస్తులను తిరస్కరించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వాళ్లలో మొత్తం 1,55,000 లబ్ధ్దిదారులు అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 4 లక్షల ఎకరాల విస్తీర్ణం మేర భూములకు అధికారులు ఇప్పటికే పట్టాలను సిద్దం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా త్వరలోనే పోడు పట్టాల పంపిణీ జరగనుంది. ఈ నెలాఖరు లోపు ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా సచివాలయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.