Monday, January 20, 2025

గిరిజనేతరులకు పోడు పట్టాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి, కాగజ్‌నగర్, బెల్లంపల్లి: బిఆర్‌ఎస్ మళ్లీ అధికారం లోకి రాగానే గిరిజనేతరులకు పోడు భూము ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆ పార్టీ అధి నేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రక టించారు. నిజానికి గిరిజనేతరులకు పట్టాలు పంపిణీ చేయాలని గతంలోనే నిర్ణయించిన ప్పటికీ ఆం క్షల పేరిట కేంద్రం అడ్డుకున్నదని ఆయన వివ రించారు. కేంద్రం మెడలు వం చైనా పట్టాలు పంపిణీ చేస్తామని, ఇందు కోసం కేంద్రంతో ఎంతవరకైనా పోరాడుతా మని స్పష్టం చేశారు. బుధవారం ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలలో ఏర్పా టు చేసిన ప్రజా అశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఆసిఫాబాద్ జిల్లా కావటంతో మెడికల్ కాలేజీతోపా టు వందలాది పడకల ఆసుపత్రి కూడా వచ్చిందని దీంతో మన్యం బిడ్డలకు మంచి జరిగిందని కెసిఆర్ అన్నారు. రైతుల సంక్షేమం కోసమే ధరణి పోర్టల్ ఏర్పాటు చేశామని, ఈ ధరణి పోర్టల్ ద్వారానే రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో పడుతున్నాయని కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కాకపోతే ఆసిఫాబాద్ జిల్లా కాకపోయేదని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరూ కూడా జిల్లా చేయలేదని అన్నారు.

మారుమూల ప్రాంతం జిల్లా అయితదని ఎవరూ కూడా కలలో కూడా అనుకోలేన్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటుతో కల సాకారం అయిందని దీంతో ఎప్పటి నుంచో ఉన్న ప్రజల కోరిక తీరిందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిందని, ఈ జిల్లాకు అదివాసీ ఉద్యమకారుడు కుమ్రంభీం జిల్లాగా పేరు పెట్టింది నేనే అని సిఎం అన్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వర్షాకాలం వచ్చింది అంటే చాలు ప్రతిరోజు మంచం పట్టిన మన్యం అనే వార్తలు వచ్చేవని అన్నారు. మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మిషన్ భగీరథ ద్వారా అదివాసీ గిరిజన గూడాలకు ప్రతి ఇంటికి శుద్ధ్దమైన తాగునీరు అందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 47వేల ఎకరాలకు పైగా గిరిజనుకు పోడు పట్టాలు అందించడం జరిగిందని, వారికి కూడా రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇచ్చామన్నారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ని తీసివేస్తామని అంటున్నారని, ధరణి పోర్టల్ తిసివేస్తే రైతుబంధుకు రాంరాం అంటరాని ఆరోపించారు. అలాగే మనం 24 గంటల విద్యుత్ ఇస్తే టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని అంటున్నాడని, మీకు 24 గంటల విద్యుత్ కావాలా, 3 గంటల విద్యుత్ కా వాలో మీరే ఆలోచించుకోవాలని అన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత మిషన్ కాకతీయ ద్వారా గ్రామాలలోని చెరువులను మరమ్మతులు చేయించుకున్నామని, అలాగే కొత్తగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకొని సాగునీరు అందిస్తున్నామని అన్నారు. దీని ద్వారా మన రాష్ట్రంలో ఏడాదికి 3 కోట్ల టన్నుల ధాన్యం పండించుకుంటున్నామని అన్నారు. దీంతో మనం త్వరలోనే తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. నూతన జిల్లాలు ఏర్పాడిన తరువాత మీముందే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అలాగే మీ జిల్లాకి మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి 300 పడకల అసుపత్రిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు జిల్లా ఎట్ల ఉండేనో, తెలంగాణ అట్టనే ఉండే, రైతుల అత్మహత్యలు, అకలిచావులు, పరిశ్రమలు మూతపడడం రకరకాల ఇబ్బందులు చూశామని, పొట్ట చేతపట్టుకొని వలసలు పోయారని, ఈ పదేండ్లలో ఒకటి ఒకటి బాగు చేసుకుంటూ ముందుకు పోతున్నామని అన్నారు. గురుకుల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారని, విద్యావ్యవస్థను బాగుచేసుకున్నామని, గురుకుల విద్యాసంస్థలు నెలకొల్పామని అన్నారు. కాలేజీలకు అప్ గ్రేడ్ చేసుకుంటున్నామని, ముస్లిం, బిసి, ఎస్సీ, ఎస్టీల కోసం గురుకులాలు పెట్టుకున్నామని అన్నారు.

ఆ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల మీద లక్ష 20 వేలు ఖర్చుపెడుతున్నామని, గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారువుతున్నారని అన్నారు. ఈ జిల్లాలో అరే, మాలి కులస్తులు ఎక్కువగా ఉంటారని, అరే కులస్తులకు ఓబిసి ఇస్తామని, మాలి కులస్తుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని అన్నారు. అలాగే నేను చెప్పిన విషయాలు అన్ని మీరు మీ గ్రామంలో చర్చించుకొని అభివృద్ధి ఎవరు చేశారో బిఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోనును చూసి అలోచించి ఓటు వేయాలని, ఓటు అనేది మీ అయుధం అని ఒక్క ఓటు మీ 5 ఏండ్ల తలరాతను మారుస్తుందని అన్నారు. కానుక మీ అభ్యర్థిని వారి వెనుక ఉన్న పార్టీని వారు చేస్తున్న అభివృద్ధ్ది పనులను గుర్తుంచుకొని ఓటు వేయాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సిఎం కెసిఆర్ ప్రశంసించారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు తాను ఎమ్మెల్యే అనే గర్వం లేదని, గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమైపోతారని అన్నారు. కొనప్ప మంచి ఎమ్మెల్యే అని, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద బిఅర్‌ఎస్ ఎమ్మెల్యేలలో అతి కొద్ది మంది గొప్ప ఎమ్మెల్యేలలో కోనప్ప ఒకరని, అద్భుతమైన ప్రజాసేవలో ఉంటారని, అంత బ్రహ్మాండంగా పని చేస్తారని అన్నారు.

నా దగ్గరికి ఎప్పుడొచ్చిన బ్రిడ్జిలు, కాల్వలు, పంచాయతీ, పట్టణ అభివృద్ధ్ది గురించే అడుగుతారని, వ్యక్తిగత పనులు అడగలేదని అన్నారు. హైదరాబాద్‌లో తక్కువ, కాగజ్‌నగర్‌లో ఎక్కువ ఉంటారని, గ్రామాల్లో తిరుగుతూ, ఎగ్జామ్స్ టైమ్‌లో పిల్లలకు భోజనాలు పెట్టిస్తారని, ఎవరికైనా ఆపద వస్తే అక్కడ వాలిపోయి ఆదుకుంటారని, గొప్ప మనసున్న వ్యక్తి అని ముఖ్యమంత్రి కొనియాడారు. కాగజ్‌నగర్ ఒకప్పుడు మిని ఇండియాలాగా ఉండేదని, అన్ని రాష్ట్రాల వారు ఇక్కడకు పనికి వచ్చేవారని అన్నారు. కాని వైభవం కోల్పోయిందని, మళ్లీ వైభవం తీసుకురావాలని అన్నారు. మిగిలిన ఖార్జానాలు తెరిపించాలని కోరారు. తప్పకుండా కోనప్ప ఆధ్వర్యంలో పరిశ్రమలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, వెంబడి పడితే విడిచే రకం కాదు కోనప్ప నియోజకవర్గం అభివృద్ధి కోసం పోరాడుతారని అన్నారు.

టిక్కెట్లు అమ్ముకున్నాడు… రాష్ట్రాన్ని అమ్మడా..?
‘కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆ పార్టీ నేతలే లొల్లిపెడుతున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. గాంధీభవన్ దగ్గర గేట్లకు తాళాలు వేసి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచన చేయాలని కెసిఆర్ కోరారు. ఇయ్యాల టికెట్లు అమ్ముకునేటోనికి రాష్ట్రాన్ని అప్పజెప్త్తే రేపు రాష్ఠ్రాన్ని అమ్మడా..? పార్టీ టికెట్లు అమ్మేటోళ్లు ఎంత గొప్పోళ్లు అన్నట్టు..? ఇసుంటి గొప్పోళ్లు మనకు కావాల్నా? ప్రజల కోసం పనిచేసే బీఆర్‌ఎస్ పార్టీ కావాల్నా..? ఎవరి పాలన కావాలో ప్రజలు సుదీర్ఘ ఆలోచన చేసి ఓటు వేయాలని సూచించారు. మీ దీవెన ఉంటే తెలంగాణను ఈ దేశంలో నంబర్‌వన్ స్టేట్‌గా తీర్చిదిద్దుతానని కెసిఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ నేతలు ధరణిని బంగాళాఖాతంలో ఎయ్యాలె అంటున్నారని, అదే విధంగా రైతుబంధు దుబారా అని మాట్లాడుతున్నారరని నిజంగానే ధరణిని బంగాళాఖాతంలో ఎయ్యాల్నా..? రైతుబంధు దుబారనేనా..? మీరు బాగా ఆలోచించాలన్నారు. ధరణిని తీసేయవద్దంటే, రైతుబంధు ఎప్పటిలాగే కొనసాగాలంటే ఇక్కడ దుర్గం చిన్నయ్యను గెలిపించాలని కోరారు.

దుర్గం చిన్నయ్య లాంటోళ్లు గెలిస్తెనే రేపు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తదన్నారు. అప్పుడే రైతుబంధు ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడని కేసీఆర్ వేస్టుగా 24 గంటలు కరెంటు ఇస్తున్నారని హేళన చేస్తున్నారన్నారు. నిజంగానే మూడు గంటల కరెంటు సరిపోతదా..? సరిపోదు గదా..? మరి 24 గంటల కరెంటు కొనసాగాలంటె ఏంజెయ్యాలె..? దుర్గం చిన్నయ్యను గెలిపించాలె. లేదంటే కరెంటు కాట కలుస్తుందన్నారు.. రైతుబంధుకు రాంరాం. మనం గుద్దేకాడ గుద్దకపోతే ఏమైతది..? తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లె మనం చల్లె, అందుకే ఆలోచించి ఓటు వేయాలన్నారు. మోసపోతె గోసపడ్తుం’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కోవలక్ష్మి, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపి నగేష్, బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు, కిషన్, సరస్వతి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News