న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్టిస్టు, కవి ఇమ్రోజ్(97) వయోభారంతో శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇమ్రోజ్ ఆరోగ్యం విషమించడంతో గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. ఇమ్రోజ్‌ను ఇటీవల ఇంటికి తీసుకురాగా శుక్రవారం తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.1926లో పంజాబ్‌లో జన్మించిన ఇమ్రోజ్ అసలు పేరు ఇంద్రజిత్ కాగా పంజాబ్ కవయిత్రి అమృతా ప్రీతమ్‌తో 1950 లలో ఏర్పడిన పరిచయం ఇద్దరినీ దగ్గర చేసింది.2005లో ప్రీతం మరణించే వరకు దాదాపు 0 ఏళ్లకు పైగా సహజీవనం చేశారు.
తొలుత ప్రీతం రచనలకు ఇమ్రోజ్ ఇలస్ట్రేటర్‌గా పని చేశారు. ప్రీతం కవిత్వాన్ని ప్రతిబింబింపజేస్తూ ప్రేమ, వైఫల్యం, మానవ సంబంధాల చుట్టూ తన భావాలను కాన్వాస్‌పై పరిచే వారు.ప్రీతం అనారోగ్యం బారిన పడిన వెంటనే ఇమ్రోజ్ రచనా వ్యాసంగం చేపట్టి పలు పుస్తకాలను రాసి ప్రీతంకు అంకితమిచ్చారు. వారి రిలేషన్‌షిప్ ప్రేరణతోనే ప్రీతంరచనలు అధికంగా ప్రేమ, సాన్నిహత్యం చుట్టూ సాగేవి. 2004లో ప్రీతం రాసిన ‘ మై తైను ఫిర్ మిలంగి’ని ఇమ్రోజ్‌కు అంకితమిచ్చారు.
ని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.