Tuesday, December 24, 2024

దశాబ్ది ఉత్సవాల్లో కవి సత్యనారాయణకు సత్కారం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం లకారం టాంక్‌బండ్‌పై ఖమ్మం జిల్లా ప్రభుత్వ శాఖల, అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కవిసమ్మేళనంలో ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ కవి, రచయిత బుక్కా సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలతో పాటు తొమ్మిది సంవత్సరాల కెసిఆర్ పాలనలో జరిగిన ప్రగతిని ప్రముఖంగా తన కవితలో ప్రస్తావించారు.

అందుకుగాను ఆయనకు జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్‌తోపాటు మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారులు, ఇతర అధికారులు నగదు ప్రోత్సాహకాన్ని, ప్రశంసా పత్రాన్ని అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్‌చే సన్మానం పొందటంతో కవి సత్యనారాయణను పలువురు కవులు, సాహితీ ప్రముఖులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News