Friday, December 20, 2024

తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులదే కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -
  • జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులదే కీలక పాత్ర అని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ అన్నారు. తెలంగాణ రా ష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విపంచి ఆడిటోరియంలో సాహితిదినోత్సవం , కవి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. స్వరాష్ట్రంలో కెసిఆర్ కవులకు సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి గు రించి ప్రజల ఆటోచనలను కవి సమ్మేళనం ద్వారా కవిత్వం రూపంలో కవులకు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట తరతరాలుగా సాహితి కేంద్రంగా విలసిల్లుతుందని ఇదే స్పూర్తిని భవిష్యత్ తరాలకు కూడా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషిలో ప్రతిఒక్క రూ బాగస్వామ్యం కావాలన్నారు.

అన్నిరంగాల్లో సిద్దిపేట ప్రగతి సాధించిన విధంగా సాహితి రంగంలో కూడా ఎప్పటికి సిద్దిపేట ఉన్నతంగా నిలిచేలా కవులు కృషి చేయాలన్నారు. సిఎం కెసిఆర్ స్వయంగా సాహితివేత్తకావడం, సాహితి అభిమాని అయిన మంత్రి హరీశ్‌రావు ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటలో కవి సమ్మేళనం నిర్వహించి సముచితంగా గౌరవించుకుంటున్నామన్నారు. ఐదు ఉత్తమ కవితలను ఎంపిక చేసి రాష్ట్ర స్థ్ధాయికి పంపిస్తామన్నారు. కవులకు మూడు వేల రూపాయల నగదు, జ్ఞాపికను ,ప్రశంసా పత్రం, శాలువాతో అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌ఓ రవికుమార్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, సీనియర్ జర్నలిస్టు కవి రంగాచారి, కవులు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, సమాచార సంబంధాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News