Wednesday, January 22, 2025

దావూద్ పై విష ప్రయోగం…. ఆస్పత్రిలో చికిత్స….

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: అండర్ వరల్డ్ డాన్, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రదారి దావూద్ ఇబ్రహీం తీవ్రం అనారోగ్యంలో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. దావూద్‌పై విష ప్రయోగం జరగడంతో భారీ భద్రత నడుమ కరాచీలో ఓ ఆస్పత్రికి అతడిని తీసుకొచ్చారు. ఆస్పత్రిలో ఓ ఫ్లోర్ మొత్తం ఖాళీ చేసి దావూద్‌కు మాత్రం చికిత్స అందిస్తున్నారని ఓ ఆంగ్ల పత్రికలో కథనాలు వెలువడ్డాయి. ఆ ఫ్లోర్‌కు కుటుంబ సభ్యులు వైద్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. పాకిస్తాన్‌లో గత రాత్రి నుంచి ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోయాయి. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగినట్టు పాక్‌లోని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. దావూద్ 1993లో ముంబయిలో బాంబు పేలుళ్లలకు పాల్పడి పాకిస్తాన్‌కు పారిపోయాడు. ఇప్పటి వరకు అతడు తమ దేశంలో ఉన్నట్టు పాకిస్తాన్ అంగీకరించడంలేదు. 2018లో ఐక్యరాజ్యసమితి దావూద్ పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News