Sunday, January 19, 2025

కాంగ్రెస్‌వి బుజ్జగింపు రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

అందుకే 370 అధికరణాన్ని రద్దు చేయలేదు
పిఒకెను తిరిగి స్వాధీనం చేసుకుంటాం
హర్యానా కర్నాల్ ర్యాలీలో అమిత్ షా

కర్నాల్ : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సోమవారం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాకు వీలు కల్పించిన 370 అధికరణాన్ని బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ రద్దు చేయలేదని ఆయన ఆరోపించారు. హర్యానాలోని కర్నాల్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) భారత్‌కు చెందుతుందని, ‘మేము దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం’ అని పునరుద్ఘాటించారు. రామ మందిరం అంశంపై కూడా కాంగ్రెస్‌ను బిజెపి సీనియర్ నేత అమిత్ షా తూర్పారబట్టారు.

పార్టీ మైనారిటీ వోటు బ్యాంక్‌ను సంతుష్టి పరచేందుకు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వంటి ఆ పార్టీ అగ్ర నేతలు రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొనలేదని ఆయన ఆరోపించారు. కాశ్మీర్‌పై కాంగ్రెస్ తీరును అమిత్ షా ఆక్షేపిస్తూ, ‘బుజ్జగింపు రాజకీయాల దృష్టానే వారు 370 అధికరణాన్ని రద్దు చేయలేదు’ అని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చుమీరుతున్నా ఆ అధికరణాన్ని కాంగ్రెస్ ఉపసంహరించలేదని హోమ్ శాఖ మంత్రి ఆరోపించారు. ‘ప్రజలు అంతా నరేంద్ర మోడీజీని రెండవ పర్యాయం ప్రధానిని చేశారు. 2019 ఆగస్టు 5న ఆయన 370 అధికరణాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కాశ్మీర్‌లో మన త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతుంది’ అనిఆయన చెప్పారు. కర్నాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, కర్నాల్ లోక్‌సభ సీటుకు పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అమిత్ షా సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘కాశ్మీర్ మనదేనా కాదాచెప్పండి. బాగా గట్టిగా చెప్పండి.

మీ వాణి ఖర్గేను చేరాలి’ అని అన్నారు. అమిత్ షా ఎఐసిసి అధ్యక్షునిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ‘ఖర్గే సాహబ్ ! మీరు 80 ఏళ్లవారు. కానీ దేశాన్ని మీరు అర్థం చేసుకోలేదు. హర్యానా యువత తమ ప్రాణాన్ని కాశ్మీర్ కోసం ఇస్తారు’ అని అన్నారు. రాజస్థాన్‌లో ర్యాలీలో రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యలపై కాకుండా 370 అధికరణం రద్దు గురించి ప్రధాని ఎందుకు మాట్లాడారని ఎఐసిసి అధ్యక్షుడు ఇటీవల చేసిన వ్యాఖ్యను దృష్టిలో పెట్టుకుని అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వివాదానికి దారి తీసిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ అణు బాంబు వ్యాఖ్యను కూడా హోమ్ శాఖ మంత్రి ఆక్షేపించారు. ‘ఈ కర్నాల్ భూమిపై నుంచి రాహుల్ (గాంధీ) బాబాకు చెబుతున్నాను.

చెవులు రిక్కించి వినండి. ఇది బిజెపి ప్రభుత్వం. పిఒకె భారత్‌కు చెందుతుంది. అది మనదిగానే ఉంటుంది. దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం’ అని స్పష్టం చేశారు. రామ మందిరం అంశాన్ని 70 ఏళ్ల పాటు తేల్చకుండా ఎందుకు అట్టిపెట్టారని కాంగ్రెస్‌ను, ముఖ్యంగా ఆ పార్టీ నేత బిఎస్ హూడాను అమిత్ షా ప్రశ్నించారు. భారత్‌ను సుసంపన్న దేశాన్ని చేసినందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను 11వ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకువచ్చినందుకు మోడీని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. మోడీ మూడవ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానానికి చేరుతుందని అమిత్ షా జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News