Wednesday, January 22, 2025

పిఒకె భారత్‌లో భాగమే: రాజ్‌నాధ్

- Advertisement -
- Advertisement -

జమ్ము: మనదేశంపై చెడు దృష్టితో ఎవరు ఉన్నా వారికి తగిన సమాధానం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని, ఏ యుద్ధంలోనైనా భారత్ గెలుస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఆదివారం దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (పిఒజెకె) గురించి మాట్లాడుతూ.. అది భారత్ లో భాగమేనని, భారత్ లోనే కొనసాగుతుందని అదే వైఖరికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కార్గిల్ విజయ దినోత్సవ స్మారక కార్యక్రమం సందర్భంగా రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడారు. 1947 నుంచి పాకిస్థాన్‌ను భారత్ ఓడిస్తూనే ఉందని, ఆ ఓటమి తరువాత పాక్ బూటకపు పరోక్ష యుద్ధాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. 1965, 1971ల్లో ప్రత్యక్ష యుద్ధాలలో పాక్ పరాజయాన్ని చవి చూశాక, భారత్‌లోకి చొరబడడానికి అనేక పన్నాగాలు పన్నుతోందన్నారు. కానీ మన వీర సైనికులు ధైర్యసాహసాలతో దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ఎలాంటి నష్టం కలగకుండా తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. పాక్, చైనాలతో యుద్ధాలు సంభవించినప్పుడు జమ్ముకశ్మీర్ ప్రజలు సైనికులతో ధైర్యంగా నిల్చున్నారని పేర్కొన్నారు.

POK is part of India says Rajnath Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News