Monday, November 18, 2024

400 సీట్లు ఇస్తే పిఓకెను భారత్‌లో విలీనం చేస్తాం

- Advertisement -
- Advertisement -

అస్సాం సిఎం హిమంత వాగ్దానం

రాంగఢ్(జార్ఖండ్): లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి 400కి పైగా సీట్లు వస్తే పాక్ ఆక్రమిత కశ్మీరును(పిఓకె) భారత్‌లో విలీనం చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం ప్రకటించారు. జార్ఖండ్‌లోని రాంగఢ్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని(యుసిసి) అమలు చేసేందుకు బిజెపికి 400కి పైగా సీట్లు అవసరమని అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి 400కిపైగా సీట్లు లభిస్తే పిఓకెని భారత్‌లో విలీనం చేస్తాం. శ్రీ కృష్ణ జన్మభూమిని, జ్ఞానవాపి ఆలయాన్ని నిర్మించడానికి, యుసిసిని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి 400కి పైగా సీట్లు బిజెపికి అవసరం. 2019లో 300కి పైగా సీట్లు వచ్చాయి కాబట్టే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించగలిగాం. జమ్మూ కశ్మీరులో 370 అధికరణ రద్దు, సిఎఎ అమలు చేగలిగాం అని శర్మ చెప్పారు. అస్సం మాదిరిగానే జార్ఖండ్ స్వరూపాన్ని బంగ్లాదేశ్ చొరబాటుదారులు మార్చివేస్తున్నారని, వారి పట్ల జెఎంఎం, కాంగ్రెస్ బుజ్జగింపు విధానాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News