Wednesday, January 22, 2025

భారత్‌లో పిఒకె విలీనం తప్పదు

- Advertisement -
- Advertisement -

జైపూర్ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె) తనంతతానుగానే త్వరలోనే భారతదేశంలో విలీనం అవుతుందని కేంద్ర మంత్రి , రిటైర్డ్ జనరల్ వికె సింగ్ సోమవారం చెప్పారు. రాజస్థాన్‌లోని దౌసాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పిఒకెలోని షియా ముస్లింలు ఇటీవలికాలంలో తాము భారత్‌లోకి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. అక్కడి ప్రజల మనోగతం, వారి ప్రస్తుత డిమాండ్ల నేపథ్యంలో ఇక త్వరలోనే పిఒకె స్వతహసిద్ధంగానే భారతదేశంలో విలీనం అయ్యే విషయం స్పష్టం అవుతోందని ఇంతకు ముందు ఆర్మీచీఫ్‌గా అనుభవం ఉన్న వికె సింగ్ తెలిపారు.

జి 20 సమ్మిట్ విజయవంతం అయిందని, ఇటువంటి సక్రమమైన నిర్వహణతో కూడిన సభలు ఇంతకు ముందు ఎక్కడా జరగలేదన్నారు. దాదాపు 200 వరకూ సదస్సులు, సభలను జి 20 విషయంలో వివిధ నగరాలలో ఏర్పాటు చేశారని, ప్రజల స్పందన బాగుందని తెలిపారు. ఇక ఇతర దేశాలు కూడా జి 20 సక్రమ నిర్వహణ, సరైన డిక్లరేషన్ పట్ల ప్రశంసలు కురిపించినట్లు సింగ్ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News