Wednesday, January 22, 2025

అదనపు ఆదాయం కోసం పేకాట

- Advertisement -
- Advertisement -

Poker Game for extra income

గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్న నిందితులు
ఆసక్తి ఉన్న వారికి ఆహ్వానం
డబ్బులు వసూలు, అన్ని ఏర్పాట్లు
చేస్తున్న నిందితులు

హైదరాబాద్: మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోజు రోజుకు గేమింగ్ హౌసులు పెరుగుతున్నాయి.అన్ని ప్రాంతాల్లో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేస్తున్న నిందితులు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో గేమింగ్ హౌస్‌ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆసక్తి ఉన్న వారిని మూ డు ముక్కలాట ఆడేందుకు పిలుస్తున్నారు. పేకాడే వారు నిర్వాహకులకు రూ.500 చొప్పున డబ్బులు ఇస్తున్నా రు. అంతేకాకుండా వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు వారి నుంచి కమీషన్ తీసుకుంటున్నారు. ఇ లా నగరంలోని చాలా ప్రాంతాల్లో గేమింగ్ హౌస్‌లు కొ నసాగుతున్నాయి. తరచూ పోలీసులు దాడి చేస్తున్నా కూడా నిందితులు వేరే ప్రాంతాలకు వెళ్లి నిర్వహిస్తున్నా రు. కానీ నిర్వహణ మాత్రం ఆపడంలేదు. గతంలో న గర శివారులో ఇలాంటి కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి, కానీ అక్కడ పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడం తో ఎవరికీ అనుమానం రాదని భావించి సిటీ మధ్యలో గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నారు. గతంలో ఏకంగా నిందితులు కంటోన్మెంట్‌లోని ఆర్మి క్వార్టర్స్‌లో గేమింగ్ హౌస్‌ను సంవత్సరాల నుంచి నిర్వహించారు.

ఆర్మీ ఆధీనంలో ఉన్న ఏరియా కావడంతో ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో నిందితులు గేమింగ్ నిర్వహించారు. కానీ ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చే శారు. ఇందులో కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బిల్డింగ్‌పై నుంచి దూకి పారిపోయేందుకు య త్నించడంతో గాయాలపాలయ్యారు. నారాయణగూడలోని అపార్ట్‌మెంట్ పైన ఉన్న పెంట్ హౌస్‌లో గేమింగ్ హౌస్‌పై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇక్కడ దా డి చేసిన పోలీసులు ఒక్కసారిగి ఆశ్చర్యానికి గురయ్యా రు. పేకాడుతున్న వారికి నిర్వాహకుడు సలక సౌకర్యా లు ఏర్పాటు చేశాడు. పేకాడుతున్న వారికి మద్యం, సిగరేట్లు, బిర్యానీ తదితర ఏర్పాట్లను చేశాడు. కావాల్సిన వారు ఆర్డర్ ఇస్తే వెంటనే నిర్వాహకులు సమకూర్చేవా డు. ఇందులో కూడా నిర్వాహకుడికి ఆదాయం వ స్తుండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా అఫ్జల్‌గం జ్ పోలీసులు అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ గదిలో నిర్వహిస్తున్న గేమింగ్ హౌస్‌పై దాడి చేసి 14మందిని అరెస్టు చే సి రిమాండ్‌కు పంపించారు.

గేమింగ్‌పై రాష్ట్రంలో నిషేధం… తెంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పేకాటను నిషేధించడంతో చా లామంది దీనికి బానిసలుగా మారిన వ్యక్తులు గేమింగ్ హౌస్‌ను ఆశ్రయిస్తున్నారు. చాలామంది పేకాటకు అలవాటు పడ్డారు, కొందరు ఆన్‌లైన్‌లో పేకాడుతూ లక్షలా ది మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలామంది ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలుగా మారడంతో క్రెడిడ్ కా ర్డులు, అప్పులు చేసి మరీ డబ్బులు పెట్టి ఆడుతున్నారు. తీరాడబ్బులు పోయాక,అప్పుపుట్టక ఆత్మహత్యకు య త్నిస్తున్నారు. ఇలా మియాపూర్‌కు చెందిన బాధితుడు లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్‌లో పేకాట ఆడి రూ.7లక్షలు పోగొట్టుకున్నాడు. క్రెడిట్ కార్డు, అప్పులు చేసి ఆడడంతో తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతోపా టు ఏకంగా బౌన్సర్లను ఇంటి వద్దకి పంపించారు. అప్పు ఇచ్చిన వారి బాధతట్టుకోలేక బాధితుడు గ్రామంలో త నకు ఉన్న భూమిని విక్రయించి మరీ అప్పు తీర్చాడు. ఇలా చాలామంది బాధితులు లాక్‌డౌన్ సమయంలో కా లక్షేపం పేరుతో పేకాట ఆడి లక్షలాది రూపాయలు పో గొట్టుకున్నారు.

సులభ సంపాదన కోసం… చాలామంది గేమింగ్ నిర్వాహకులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వే సి గేమింగ్ హౌస్‌లు నిర్వహిస్తున్నారు. చాలామంది ఇ ళ్లను అద్దెకు తీసుకుని మరీ గేమింగ్ హౌస్‌లను నిర్వహిస్తున్నారు. పేకాడుతున్న వారి నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు డబ్బులు కమీషన్ రూపంలో తీసుకుంటుండడం తో చాలామంది వీటిని నిర్వహిస్తున్నారు. పోలీసులు అ రెస్టు చేసి జైలుకు పంపించినా కూడా బయటికి వచ్చిన తర్వాత మళ్లీ గేమింగ్ హౌస్‌లను వేరే ప్రాంతాల్లో ఏ ర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News