Thursday, January 23, 2025

జూబ్లీహిల్స్‌లో పేకాటరాయుళ్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Poker players Arrest in Jubilee Hills

జూబ్లీహిల్స్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పేకాటస్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పెద్దమ్మ గుడి వెనుక ఉన్న ఇంటిపై పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో పేకాడుతన్న 13 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బొల్లినేని బలరామయ్య, బొల్లినేని శీనయ్య మరికొందరూ ఉన్నారు. కొన్నాళ్లుగా బలరామయ్య పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News