Wednesday, January 22, 2025

త్రిమూర్తుల సాక్ష్యం పోఖ్రాన్ : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

పోఖ్రాన్ : భారత దేశ ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం ఈ త్రిమూర్తుల సాక్షం పోఖ్రాన్ అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి 100 కిమీ దూరంలో పోఖ్రాన్ వద్ద 50 నిమిషాల పాటు సాహసోపేతమైన త్రివిధ దళాల విన్యాసాల సందర్భంగా ప్రధాని మోడీ ప్రసగించారు. భారత శక్తి విన్యాసాల సందర్భంగా గాలిలో విమానాల గర్జన, నేలపై సైనికుల శౌర్యప్రదర్శన, నయాభారత్‌కు ఆహ్వానం పలుకుతున్నాయని అభివర్ణించారు. గతంలో పోఖ్రాన్ వద్దనే అణుపరీక్ష జరిగిందని గుర్తు చేశారు.

సమకాలీన, భవిష్యత్ సవాళ్లను స్వదేశీ పరిష్కారాలతో అధిగమించడానికి భారత్ సిద్ధంగా ఉందనడానికి ఇది స్పష్టమైన సంకేతంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత శక్తి ఉన్నతస్థాయిలో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, దేశ రక్షణ సామర్థాలను ప్రదర్శించగలదని వివరించారు. భారీ ఎత్తున త్రివిధ దళాల విన్యాసాలను ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఎల్‌సిఎ తేజస్ , ఎఎల్‌హెచ్ ఎంకె 4 యుద్ధ విమానాలు గగనవీధుల్లో విహరిస్తూ విన్యాసాల హోరెత్తించగా, ప్రధాన యుద్ధ శకటాలు అర్జున్, కె9 వజ్ర, ధనుష్ , సారంగ్ సాయుధ వ్యవస్థలు నేలపై కాల్పులతో ఘోషిల్లాయి. ఈ విన్యాసాల ప్రదర్శన కార్యక్రమంలో దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News