Sunday, November 24, 2024

పోలవరం అగాధాలు పూడ్చివేత పనులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట వద్ద ఆగాధాలు పూడ్చివేత పనులు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ కమిటి ఆమోదించిన డిజైన్ల ప్రకారం పనులు ప్రారంభించారు. గతంలో వచ్చిన భారీ వదరల వల్ల ప్రధాన ఆనకట్ట వద్ద గ్యాప్1,గ్యాప్2లో భారీగా గుంతులు ఏర్పడ్డాయి.

ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పడిన అగాధాలను పూడ్చటంలో భాగంగా ఇసుకను డోజర్ల ద్వారా నింపుతున్నారు. ఇసుకను నింపిన తర్వాత వైబ్రో క్యాంపక్షన్ విధానంలో ఆ ప్రాంతాన్ని గట్టిపర్చనున్నారు. ఇది పూర్తయ్యాక నేషనల్ హైడ్రో పవర్ కార్పోరేషన్ డయాప్రమ్ వాల్ పటిష్టతపై ఇచ్చిన నివేదిక ఆధారంగా డిడిఆర్‌పి ఆమోదం పొందిన తరువాత పనులు చేపడతారు. ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పనులు కూడా ప్రారంభించనున్నట్టు జలవనరుల శాఖ ఎస్‌ఇ నరసింహమూర్తి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News