- Advertisement -
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అభిమానులకు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లుఅర్జున్ అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బన్నీని అరెస్టు చేయడంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టలు పెట్టడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు నాలుగు కేసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
- Advertisement -