Tuesday, January 21, 2025

సిద్దిపేటలో పోలీస్ యాక్టు అమలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో 22(1) ఏ నుండి ఎఫ్, 22(2) ఏ అండ్ బి, 22(3) యాక్టు ప్రకారం ఈ నెల 09-02 -23 నుండి 16- 02-23 వరకు సిటీ పోలీసు యాక్టు అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ శ్వేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా ఈ కార్యక్రమాలు చేపడితే ముందస్తుగా పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలను, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అనుమతి లేకుండా ఫారాగ్లెడర్, రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్ రిమోట్ కంట్రోల్డ్ మైక్రోలైట్స్ ఎయిర్ క్రాప్ట్ మొదలైన వాటి వాడకంపై నిషేదం శాంతి భద్రతల పరిరక్షణ చర్యలకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. చిన్నపిల్లలు, వృద్దులు, రోగులు, విద్యార్ధుల విబ్యాసానికి భంగం కలగకుండా శబ్దకాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేదం అన్నారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపితస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ అధికారుల అనుమతి పొందాలని సూచించారు. పై నిబంధనలు ఉల్లంఘించిన డిజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News