Monday, January 20, 2025

అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పోలీసుల దూకుడు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ ఫోన్ సీజ్
5న విచారణకు రావాలని నోటీస్

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎడిటె డ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దూ కుడు పెంచారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీత ఫోన్‌ను పోలీసు లు సీజ్ చేశారు. అ నంతరం ఆమెకు సి ఆర్‌పిసి 41ఎ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల మెదక్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మళ్లీ బిజెపి ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. కానీ కొందరు ఆ వీడియోను మార్చి మొత్తం రిజర్వేషన్లనే రద్దు చేస్తామని చెప్పినట్లుగా క్రియేట్ చేశారు.

ఏప్రిల్ 25న అమిత్ షా మాట్లాడితే ఏప్రిల్ 29 వరకూ ఈ వీడియో బయటికి రాలేదు. వీడియో మార్ఫింగ్ చేశారని తెలుసుకున్న బిజెపి నేతలు సైలెంట్‌గా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వెంటనే 10 మం దికి నోటీసులిచ్చారు. వారిలో నలుగురు తెలంగాణకు చెందిన వారే ఉ న్నారు. వారందరికీ 91/160 సిఆర్‌పిసి కింద నోటీసులిచ్చారు. తాజాగా తెరపైకి కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీత పేరు రావడంతో ఇంకా ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News