Thursday, January 23, 2025

శేషన్న ప్రశ్నిస్తున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ వ్యక్తిని పిస్టల్ తో బెదిరించిన కేసులో శేషన్నను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్లా అనే వ్యక్తి పిస్టల్ తో బెదిరించినట్లు పిఎస్ లో బాధితుడి ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. హుమాయూన్ నగర్ పోలీసులు అబ్దుల్లాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అబ్దుల్లాకు శేషన్న పిస్టల్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులు ఈ కేసులో భాగంగా శేషన్నను అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతంలో శేషన్నను సిఐ సెల్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కరుడుగట్టిన నేరస్తుడు నయీం ప్రధాన అనుచరుడిగా శేషన్న వ్యవహరించారు. 2016 ఆగస్టు 8న నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి శేషన్న వెళ్లారు. గత ఏడాది కాలంలో శేషన్న పలువురిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మైలార్ దేవ్ పల్లి, హుమాయూన్ నగర్, గోల్కొండ పిఎస్ లలో శేషన్న పై కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News