Monday, December 23, 2024

ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత

- Advertisement -
- Advertisement -

గోదావరిఖణి: ప్రజల రక్షణ, భద్రత పోలీసు బాధ్యతని గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్ అన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్‌లో సోమవారం గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్‌పర్యవేక్షణలో గోదావరిఖని వన్‌టౌన్ సిఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో 30 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వాహన పత్రాలు సరిగా లేని 55 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ కాలనీలలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకొని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరైనా కొత్త వారు అద్దెకు వస్తే వారికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకోవాలని అన్నారు.

నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్‌టౌన్ సిఐలు ప్రమోద్‌రావు, ప్రసాద్ రావు, ఎస్‌ఐలు సమ్మయ్య, స్వామి, వెంకట్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News