Wednesday, July 3, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అమీర్‌పేట ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 15.13గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…పబ్బుల్లో డిజేలుగా పనిచేస్తున్న వారు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది బంజారాహిల్స్‌లో దాడులు నిర్వహించారు. డిజేగా పనిచేస్తున్న అఖిల్ వద్ద నుంచి 2.65 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, ఇబ్రహీంపట్నంకు చెందిన సన్నీ వద్ద నుంచి 12.48 గ్రాముల ఎండిఎంఏ, వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న బెంగళూరుకు చెందిన అలెక్స్‌ను అరెస్టు చేశారు. డిజే ప్లేయర్ డ్రగ్స్ విక్రయిస్తున్నారని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందికి సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ముందుగా డిజే అఖిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుక వచ్చావని ప్రశ్నించగా తనకు ఇబహ్రింపట్నంకు చెందిన సన్నీ అనే వ్యక్తి ఇచ్చాడని సమాచారం ఇచ్చాడు. దీంతో ఇబ్రహింపట్నంలోని సన్నీ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆతడి వద్ద 12.48 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ లభించింది. సన్నీ ఒక గ్రాము ఎండిఎంఎను రూ. 5000 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. డ్రగ్స్‌ను బెంగూళూర్‌కు చెందిన అలెక్స్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 326 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పట్టుకున్న వారిలో ఈఎస్ నవీన్‌కుమార్, లక్ష్మారెడ్డి, బాలరాజ్, యాదగిరి, మహేశ్వర్‌రావు, అరుణ్, కృష్ణ పాల్గొన్నారు. డ్రగ్స్‌ను పట్టుకున్న ఎన్‌ఫోర్స్ సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్‌రెడ్డి అభినంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News