Sunday, December 22, 2024

స్నేహితుడి భార్యపై కన్నేసి హత్య….. 19 ఏళ్ల తరువాత పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: స్నేహితుడి భార్యను హత్య చేసిన నిందితుడిని 19 ఏళ్ల తరువాత పోలీసులు అరెస్టు సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఢిల్లీలోని పాచిమ్ విహార్ ప్రాంతంలో ప్రవీణ్ అనే మహిళ తన భర్త గుల్షాన్‌తో కలిసి ఉంటుంది. 1997లో ఓ వివాహ వేడుకలో సురేంద్ర అనే వ్యక్తి ద్వారా నరేంద్ర అనే వ్యక్తి గుల్షానకు పరిచయమవుతాడు. నరేంద్ర భార్యపై కన్నేసి గుల్షాన్‌తో పరిచయం పెంచుకుంటాడు. గుల్షాన్ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. 2004 అగష్టు 27న గుల్షాన్ ఫ్లాట్‌కు నరేంద్ర వచ్చాడు. ఒంటరిగా ఉన్న ప్రవీణతో నరేంద్ర అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆమె ప్రతిఘటించడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తుంది. దీంతో దుప్పెట ఆమె మెడకు చుట్టి హత్య చేసి అక్కడ నుంచి నరేంద్ర పారిపోతాడు. ప్రవీణ తన బెడ్ మీద అచేతనంగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

ఆమె చనిపోయిందని వైద్యులు తెలపడంతో మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టు మార్టమ్‌లో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితురాలి ఇంట్లో నుంచి నరేంద్ర వెళ్తున్నప్పుడు 11 ఏళ్ల బాలుడు చూశానని పోలీసులకు చెబుతాడు. విష్ణు గార్డెన్ ప్రాంతంలో నరేంద్ర ఓ ఇళ్లు అద్దెకు తీసుకున్న విషయం తెలియడంతో అక్కడికి వెళ్లి పోలీసులు విచారిస్తారు. నరేంద్ర అప్పటికే అక్కడి నుంచి జమ్ము మకాం మారుస్తాడు. జమ్ము నుంచి లూథియానాకు మకాం మారుస్తాడు. పోలీసులు అప్పటి నుంచి అతడి కోసం వెతుకుతూనే ఉంటారు. హర్యానాలో పంచకుల ప్రాంతంలో నరేంద్రను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఇప్పుడు నిందితుడి వయసు 64 ఏళ్లు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News