Saturday, December 21, 2024

ప్రేమ వ్యవహారం..యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

టేకులపల్లి : మండల పరిధిలోని ముత్యాలంపాడు స్టేజి గ్రామంలో జరిగని యువకుడి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈమేరకు ఇల్లెందు డియస్పి రమణమూర్తి సోమవారం సాయంత్రం సర్కిల్‌ఇన్సెపక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ముత్యాలంపాడు పంచాయతీ శాంతినగర్ గ్రామానికి చెందిన మృతుడు అశోక్ నిందుతుడు గోవిందు కుమారుడు ప్రేమ్‌కుమార్ అక్కతో ప్రేమ వ్యవహారం నడిపాడు.కాని తీరా పెళ్ళి సమయంలో ఆమెను మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇది జరిగి రెండు సంవత్సరాలు అయింది. ఈ విషయమై ప్రేమ్‌కుమార్ మృతుడు అశోక్‌పై కక్ష పెంచుకున్నాడు.

ఈ నేపధ్యంలో అశోక్‌తో మంచిగానే వుంటూ అతని వద్ద తన ఆర్థిక అవసరాలకు కొంత మొత్తం నగదును తీసుకున్నాడు. అలా అతని వద్ద తీసుకున్న నగదు తిరిగి చెల్లిస్తానని ఒక చోటుకి రమ్మన్నాడు. దీంతో అశోక్ ప్రేమ్ కుమార్ చెప్పిన చోటుకి వచ్చాడు. అశోక్ ముందస్తు పథకం ప్రకారం అతనిని చంపాలని తలచి అతని తలపై ఇనుప రాడ్డుతో కొట్టి అనంతరం కత్తితో మెడ కోసి హత్య చేచి పరారయ్యాడు. స్ధానికుల సమాచారం మేరకు సంఘలన స్ధలానికి వచ్చిన పోలీసులు ఘటన స్దలంలో హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. ఈ విలేకురుల సమావేశంలో స్థానిక సిఐఇంద్రసేనారెడ్డి యస్‌ఐశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News