- Advertisement -
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి చనిపోవడంతో గురువారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
అంత్యక్రియల కోసం షకీల్ ను బోధన్ కు తీసుకెళ్లి.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. అయితే, షకీల్ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా, పలు కేసుల్లో షకీల్‌పై గతంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన దుబాయ్ పారిపోయారు. అప్పటి నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు.
- Advertisement -