Monday, December 23, 2024

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను కాలాపత్తర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2,000 నకిలీ నోట్లు రూ.69,04,000 స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కుతుబుల్లాపూర్, చింతల్‌కు చెందిన ఖాజా నవీనుద్దిన్, నిజామాబాద్‌కు చెందిన షిండే, చార్మినార్‌కు చెందిన జాహెద్ ఖాన్, ఎండి రయిసుద్దిన్, మహ్మద్ అన్వార్, మహ్మద్ మునీర్ అలీ అలియాస్ మునీరుద్దిన్ అలియాస్ గౌస్ పాషా కలిసి నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నారు.

ఇందులో ఖాజా నవీనుద్దిన్, షిండే పరారీలో ఉండగా, మిగతా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఖాజా నవీన్‌ద్దిన్ సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. మిగతా వారికి నకిలీ రెండు వేల నోట్లను ఇచ్చి నగరంలోని పాతబస్తీకి పంపించాడు. అమయాకులకు ఎక్కువ డబ్బులు ఆశచూపి నకిలీ నోట్లను అంటగట్టాలని ప్లాన్ వేశాడు. దీనిలో భాగంగా నలుగురిని పంపించాడు. వీరు నకిలీ నోట్లను చెలామణి చేస్తుండగా ఎస్సై శ్రీనివాసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ దాలినాయుడు, తదితరులు పట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News