Tuesday, March 25, 2025

ఐపిఎల్ టికెట్లు బ్లాక్‌లో అమ్మకం.. నలుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2025లో రెండో మ్యాచ్ ఉప్పస్టేడియంలో జరుగనున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ తమ ఫేవరేట్ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ఎదురూచూస్తున్నారు. అయితే దీన్నే కొందరు కేటుగాళ్లు అదునుగా తీసుకొని.. మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అధిక ధరకి విక్రయిస్తున్నారు. అలా మ్యాచ్ టికెట్లను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పటివరకూ బ్లాక్‌లో టికెట్లు అమ్ముతూ అరెస్ట్ అయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఇక గత ఏడాది రన్నర్ అప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టైటిల్‌ను సొంతం చేసుకొవాలని భావిస్తోంది. ఈసారి బలమైన జట్టుతో సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా పటిష్టంగానే ఉంది. ఈ మ్యాచ్‌లో విజయంతో టోర్నమెంట్‌ను ప్రారంభించాలని రాజస్థాన్ అనుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News