Sunday, December 22, 2024

ఫైవ్‌స్టార్ రాజభోగాలు..వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తన కుటుంబంతో పాటు విలాసవంతమైన ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేసిన వ్యక్తి దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకూ బిల్లు చేశాడు. అయితే వీటిని ఎంతకూ చెల్లించకపోవడం, బస ఖాళీ చేయకపోవడంతో హోటల్ యాజమాన్యం చేసిన ఫిర్యాదుతో ఈ వ్యక్తిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. స్థానిక లూత్యెన్స్ ప్రాంతంలో తమ మొండి బకాయిల అతిధితో హోటల్ వారు చుక్కలు చూశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వ్యక్తి రెండు రూంలు బుక్ చేసుకుని ఉంటూ వచ్చాడు. విందులు వినోదాలు సాగించాడు. ఈ విధంగా చివరికి ఆయన బిల్లు మూడు నాలుగు లక్షలు వరకూ చేరడంతో చెల్లింపుల కోసం అడగడంతో గత నెల 31 తుదిగడువు పెట్టాడు.

అయితే చెల్లించలేదు. పైగా ఈ అతిధి తాను హోటల్ వారికి ఇప్పటికే దాదాపు రూ 7 లక్షల వరకూ చెల్లించినట్లు తప్పుడు యుటిఆర్ ఖాతా నెంబర్ల పత్రం చూపించాడు. దీనితో ఈ వ్యక్తిపై హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. తాను తప్పుడుచెక్ ఇచ్చినట్లు తెలిపిన ఆయన పొరపాటు జరిగిందని, జూన్ 3న చెల్లింపులు ఉంటాయని నమ్మబలికాడు. యధావిధిగా హోటల్‌లో రాజభోగాలు అనుభవించాడు. అయితే ఈ గడువు ముగిసినా తాపీగా అక్కడనే ఉండటంతో అడగడానికి వెళ్లిన సిబ్బందితో బెదిరింపులకు దిగాడు. వారికి వ్యతిరేకంగా పోలీసుల వద్దకు వెళ్లుతానని తెలిపాడు. మేనేజర్‌ను తిట్టాడు. పైగా అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాడు. దీనితో పోలీసులు వచ్చి ఈ వ్యక్తిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఆయన సంగతి తెలుసుకునేందుకు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News