Sunday, December 22, 2024

చిట్టీల పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిన వ్యక్తిని సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….కుత్బుల్లాపూర్, చింతల్‌కు చెందిన మాలినేని సీతారామయ్య, తన అల్లుడు మురళికృష్ణతో కలిసి సోమశేఖర ఫిన్ కార్పొరేషన్ పేరుతో గత 30 ఏళ్ల నుంచి నెల నెల చిట్టీలు నడిపిస్తున్నారు. లక్ష, రెండు లక్షలు, ఐదు లక్షలు, పది లక్షల చిట్టీలు నడిపిస్తున్నాడు. 30 ఏళ్ల నుంచి చిట్టీల నడిపిస్తుండడంతో చాలామంది నమ్మి చిట్టీలు వేశారు. ఇలా రూ.2,65,94,670 కోట్లు వసూలు చేశాడు.

తర్వాత జులై,2024లో చిట్టీలు ఆపివేస్తున్నానని సభ్యులకు చెప్పాడు. అందరి డబ్బులు చెల్లిస్తానని బాధితులకు హామీ ఇచ్చాడు. తర్వాత కుటుంబంతో పాటు నగరం నుంచి పారిపోయాడు. దీంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని ఎపిలోని ఎన్‌టిఆర్ జిల్లా, నందిగామలో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకుని వచ్చి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ ఏ. శ్రీధర్‌కుమార్ దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News