Monday, January 20, 2025

మొబైల్ ఫోన్ స్నాచర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మార్నింగ్ వాకర్స్‌ను టార్గెట్‌గా చేసుకుని మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న నిందితుడిని సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. హైదరాబాద్,యాకత్‌పురకు చెందిన ఎండి అబ్దుల్లా స్నాచింగ్ చేస్తుంటాడు. నిందితుడిపై ఇప్పటి వరకు మలక్‌పేట, చాదర్‌ఘాట్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

నిందితుడు మార్నింగ్ వాకింగ్‌కు వచ్చే వారిని టార్గెట్‌గా చేసుకుని మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నాడు. వాకింగ్ చేస్తున్న వారి వెనుక నుంచి వచ్చి మొబైల్ ఫోన్‌ను లాక్కుని తన హోండా యాక్టివా బైక్‌పై పారిపోయేవాడు. చోరీ చేసిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే వారికి తక్కువ ధరకు విక్రయించేవాడు. వరుసగా కేసులు నమోదు కావడంతో నిఘా పెట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ నర్సింహులు, సిపిలు మహేష్ బాబు, నూర్ ఇస్మాయిల్ బాష, సందీప్, సురేష్, విశాల్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News