Sunday, March 23, 2025

ఐపిఎల్ టికెట్లు బ్లాక్‌లో విక్రయం: ఒకరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ 18వ సీజన్‌లో రెండో మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌ టికెట్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మార్గాల్లో నిమిషాల్లో అమ్ముడుపోయాయి. దీంతో ఎలాగైనా మ్యాచ్ చూడాలనే అభిమానుల ఆశని కొందరు బ్లాక్ మార్కెట్‌లో టికెట్లను ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని ఉప్పల్ మెట్రోస్టేషన్ వద్ద ఎస్‌ఒటి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, టికెట్లను ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఉప్పల్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News