Friday, December 20, 2024

బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రవీణ్ లోంకర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్య కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం పూణెకు చెందిన ప్రవీణ్ లోంకర్‌ను అరెస్టు చేసింది. ముంబై పోలీసుల కథనం ప్రకారం, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్యకు బాధ్యత వహించిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శుబు లోంకర్ సోదరుడు ఈ ప్రవీణ్.

ప్రస్తుతం శుబు లోంకర్ పరారీలో ఉన్నాడు. అరెస్టయిన నిందితులిద్దరికీ ప్రవీణ్ లోంకర్ పూణేలో ఆశ్రయం ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపి నేత బాబా సిద్ధిక్‌ హత్య కేసులో నిందితుడు ధర్మరాజ్‌ కశ్యప్‌కు ఆసిఫికేషన్‌ టెస్ట్‌ ను ముంబై పోలీసులు నిర్వహించగా, అతడు మైనర్‌ కాదని నిర్ధారించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆసిఫికేషన్ టెస్ట్ అనేది ఎముక కలయిక స్థాయిని విశ్లేషించడం ద్వారా వ్యక్తి యొక్క వయస్సును అంచనా వేసే ఒక వైద్య ప్రక్రియ, సాధారణంగా వయస్సు నిర్ధారణకు ఉపయోగించబడుతుంది. పరీక్ష ఫలితాల తర్వాత, కశ్యప్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా కోర్టు అక్టోబర్ 21 వరకు పోలీసు కస్టడీని మంజూరు చేసింది. కశ్యప్ తరపు న్యాయవాది అతను మైనర్ అని చెప్పడంతో ముంబయిలోని ఎస్ప్లానేడ్ కోర్టు ఆసిఫికేషన్ పరీక్షకు ఆదేశించింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టయిన నిందితుడు ప్రవీణ్ లోంకర్ (28) ,  శుభం లోంకర్ సోదరుడు. అతను కూడా కుట్రలో ఇరుక్కున్నాడు. సిద్దిక్‌ను చంపే పథకంలో ధర్మరాజ్ కశ్యప్, శివకుమార్ గౌతమ్‌లను ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌ను నిర్మల్‌నగర్‌లోని తన కార్యాలయం బయట కాల్చి చంపారు. ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించే ముందు అతనికి అనేక తుపాకీ గాయాలు తగిలాయి, ఆసుపత్రిలో ఆయన శనివారం రాత్రి మరణించాడు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News