Thursday, January 23, 2025

చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం

- Advertisement -
- Advertisement -

అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు
300 రకాల వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తింపు
ముఠా సభ్యులనుంచి నకిలీ డేట్‌ల స్టాంప్స్, స్టిక్కర్స్ స్వాధీనం
నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామన్న పోలీసులు

హైదరాబాద్: భాగ్యనగరంలోని బొడుప్పల్‌లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాలం చెల్లిన వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు తినుబండారాలు, షాంపులు, సబ్బులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కాలం చెల్లిన వస్తువులు, పదార్ధాలను సేకరించి కొత్త లేబుల్ వేసి విక్రయిస్తున్నారు. మొత్తం 300 రకాల వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వస్తువులు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే గోదాంలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వస్తువులతో పాటు నకిలీ డేట్‌ల స్టాంప్స్, స్టిక్కర్స్ స్వాధీనం చేసుకున్నారు. బొడుప్పల్‌తో పాటు కోఠిలోని హరిహత్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిపిన సోదాల్లో వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశారు.

ఇక్కడ కాలం చెల్లిన చాలా వస్తువులకు కొత్త లేబుల్ వేసి మార్కెట్‌లోకి పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని, ఎప్పటినుంచి ఈ పని చేస్తున్నారనే విషయం తెలుసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. స్థానికుల నుంచి వచ్చిన సమాచారంతో గోదాంలలో సోదాలు జరిపి పట్టుకున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు తినే చాక్కెట్లు, బిస్కెట్లను ఎక్కువగా రీసైక్లింగ్ చేస్తున్నారని, ఇలాంటి కాలం చెల్లిన వస్తువులను తినడం ద్వారా చిన్నారులు అనారోగ్యాల బారిన పడే అవకాశముందని చెబుతున్నారు.

నగర శివారులో పలుచోట్ల ఇలాంటి గోదాంలు ఉన్నట్లు తెలుస్తోంది. కాలం చెల్లిన వస్తువులను సేకరించి కొత్త లేబుల్ వేసి మార్కెట్‌లోకి పంపిస్తున్నారు. ఇలా చేస్తూ రూ.కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా ఇలాంటి వ్యవహారాలు జరుగుతుండగా, ఇప్పుడు పోలీసులకు ఈ ముఠాలు చిక్కాయి. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి ముఠాలు విస్తరించినట్లు తెలుస్తోంది. అయితే ఎక్స్‌పైరీ అయిన పదార్థాలను తినడం ద్వారా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కడుపునొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు, డయేరియా బారిన పడతారని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News