Monday, December 23, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం… సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహకుడి హస్తం

- Advertisement -
- Advertisement -

Police arrest Sai Defense Academy administrator

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో ఆందోళనలో పాల్గొన్న సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని ఖమ్మం అదుపులోకి తీసుకొని నర్సరావుపేటకు తరలించారు. అనంతరం నర్సరావు పేట నుంచి హైదరాబాద్ కు తరలించనున్నారు.  ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేసున్నారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులు షల్టర్ తీసుకునట్టు పోలీసులు గుర్తించారు. ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలోనే విద్యార్థులు సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చారు. విద్యార్థులకు బటర్ మిల్క్, వాటర్ బాటిల్స్, పులిహోర ప్యాకెట్లను సాయి డిఫెన్స్ అకాడమీ యాజమాన్యమే సప్లయ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలలో సుబ్బారావుకు తొమ్మిది కోచింగ్ సెంటర్లు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News