Thursday, December 26, 2024

స్వామిజీ మహిమల వల్లనే పలువురికి మాటలు..

- Advertisement -
- Advertisement -

గద్వాల టౌన్: తాను మనిషి కాదని, మనిషి రూపంలో ఉన్న శ్రీనివాసుడునని, తనను క్రమం తప్పకుండా అయిదు శనివారాలు దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యల భాదపడుతున్న వారి సమస్యలను పరిష్కరిస్తాన్నాని తమిళనాడుకు చెందిన ఓ స్వామిజీ (సంతోష్‌కుమార్) కేటిదొడ్డి మండలంలో ఓ వ్యవసాయ పొలంలో కూర్చోని భక్తులకు దర్శనమిస్తున్నాడు. వివిధ రోగాలతో బాధపడేవారు స్వామిజీ దర్శించుకున్న తర్వాత నయం అయిందని మండలంలో ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో భక్తులు పెద్ద ఎత్తున్న స్వామిజీని దర్శించుకోవడానికి బారులుతీరారు. పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో కేటిదొడ్డి పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు. సభ, సమావేశానికి పోలీస్ శాఖ అనుమతులు లేకపోవడంతో అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సంతోష్‌కుమార్ అనే స్వామిజీ తన శరీరంలోకి రంగనాథస్వామి వచ్చి నడిపిస్తున్నాడని అనారోగ్యంతో, ఇతర సమస్యలతో బాధపడే ప్రజల సమస్యలు తీర్చేందుకు తనకు కొంత స్థలం కేటాయించాలని కేటిదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామ సర్పంచు సత్యనారాయణను కోరగా కొండాపురం స్టేజ్ వద్ద ఉన్న ఓ వ్యవసాయ పొలంలో స్వామిజీకి కొంత స్థలాని కేటాయించాడు. అక్కడే కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకొని, భక్తులకు దర్శనమిస్తున్నాడు. వచ్చిపోయే భక్తులకు తిరుపతిలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి వారికి వేసే ప్రత్యేక పూలంకారణ త్వరలో తనకు వేస్తారని భక్తులతో చెప్పుకోవడం జరిగింది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కుటుంబ సభ్యులతో తనని దర్శించుకుంటే సర్వరోగాలు పోయి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారని భక్తులకు తెలియజేశారు.

విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు స్వామిజీని దర్శించుకుని తమ సమస్యలు వెల్లి బుచ్చుకున్నారు. గత మూడు రోజులగా వివిధ రోగాలు, సమస్యలతో బాధపడేవారి సమస్యలు స్వామిజీ తీరుస్తూ వస్తున్నాడని పలువురు పేర్కొన్నారు. స్వామిజీ మహిమల వల్లనే పలువురికి మాటలు వచ్చాయని, నడవలేని స్థితిలో ఉన్నవారు నడుస్తున్నారని ప్రచారం చుట్టు పక్కల గ్రామాలకు పాకింది. ఆదివారం ప్రజలు స్వామిజీ దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. భక్తుల రాక అధికకావడంతో స్వామిజీ నివసిస్తున్న చోట ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేటిదొడ్డి ఎస్‌ఐ వెంకటేష్ ఆదేశాల మేరకు స్వామిజీని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత పలు నిబంధనలతో వదిలిపెట్టారు. కాగ తమిళనాడుకు చెందిన సంతోష్‌కుమార్ అనే స్వామిజీ వెంటా ఆయన ఇద్దరు భార్యలు, కుమారుడు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వనపర్తి జిల్లా సుగూరు గ్రామంలోని ఓ దేవాలయంలో తన కుమారుడు పూజారీగా పని చేశాడని స్వామీజీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News