Thursday, April 24, 2025

ఎమ్మెల్యేకి బెదిరింపులు.. యూట్యూబర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావును బెదిరించిన కేసులో యూట్యూబర్ మనెం శ్యామ్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన సున్నిత సమాచారం ఉందని శ్యామ్ బెదిరించాడు. సోషల్‌‌మీడియాలో పెట్టకుండా ఉండాలంటే.. డబ్బులు ఇవ్వాలని శ్యామ్ డిమాండ్ చేశాడు. తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని.. లక్ష్మీకాంత రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్‌ని అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం బెదిరించిన వ్యవహారంలో శ్యామ్‌తో పాటు మరో మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News