మామునూరు(సంగెం): గంజాయి తరలిస్తున్న దొంగలను పట్టుకున్న సంఘటన మామునూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొందరు దొంగలు నర్సీపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయిని ఒక కారులో తరలిస్తున్నారనే సమాచారం మేరకు మంగళవారం మామునూరు పోలీసు సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఫోర్త్ బెటాలియన్ రెండవ గేటు ముందు వాహనాల తనిఖీ చేస్తుండగా కారును ఆపే ప్రయత్నం చేయగా కారులో ఉన్న ముగ్గురు ఒక్కసారిగా డోర్లు తీసి పారిపోడానికి ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం విచారించగా షేక్ జిలాని, పినారిపాలెం నర్సీపట్నం మండలం అనకాలపల్లి,
మొహమ్మద్ అఫ్రోజ్ శంబానినగర్ ఖమ్మం అర్బన్, అడ్డూరి వెంకటేశ్ ఎస్సీ కాలనీ నర్సీపట్నం అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్ నాలుగవ వ్యక్తి అడిగర్ల ప్రకాష్‌కుమార్ గ్రామం నీలంపేట నర్సీపట్నం మండలంగా గుర్తించారు. కాగా వీరందరూ 86.52 కిలోల గంజాయి తీసుకొని నర్సీపట్నం నుంచి మహారాష్ట్రకు వరంగల్ మీదుగా కారులో తీసుకెళ్తుండగా వాహన తనిఖీలో దొరినట్లు తెలిపారు. కాగా వీరి నుంచి ఒక కారు, మూడు సెల్‌ఫోన్లు, 86.52 కిలోల గంజాయి స్వాధీనం చేసుక్నుట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఎసిపి జితేందర్‌రెడ్డి, మామునూరు ఎసిపి నరేశ్‌కుమార్, సిఐ క్రాంతికుమార్, ఎస్ఐ లు రాజేష్‌రెడ్డి, కృష్ణవేణి, పోలీసు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు.