Monday, December 23, 2024

రేపు కోర్టుకు నవీన్‌రెడ్డి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి దాడిలో పాల్గొన్న 32 మంది హస్తినాపురం కేశవపురి కాలనీలోని మిస్టర్ టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశమైనట్లు సమాచారం అందుకుని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరిలో నాగారం భానుప్రకాశ్(20), రాథోడ్ సాయినాథ్(22), గానోజి ప్రసాద్ (25), కోతి హరి (30), బోని విశ్వేశ్వర్‌రావు (26)లను కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును గురువారానికి వాయిదా వేసింది.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మంగళవారం గోవాలో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసందే. నవీన్‌రెడ్డిని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన పోలీసులు గురువారం కోర్టులో హాజరు పర్చనున్నారు. నవీన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చందు, ప్రవీణ్, ప్రకాశ్, మహేశ్, యశ్వంత్‌లను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News