మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వినీత్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం భద్రాచలం ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి తమ వాహనాలు వదిలేసి పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎపీ29బిఆర్1116మరియు ఎపీ 09 ఎజెడ్9868 అను నంబర్లు గల వాహనాలను తనిఖీ చెయ్యగా 97,60.000విలగల 488కేజీల గంజాయిని గుర్తించడం జరిగిందని తెలిపారు.
పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా ఒకరు తాళ్లగొమ్మురు, సారపాకకు చెందిన డి.శివశంకర్ రెడ్డి, మరొకరు అదే గ్రామానికి చెందిన నాగేంద్రబాబులుగా తెలిసిందని, ఆంద్రపదేశ్, ఒడిసా సరిహద్దు పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులను నుండి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర రాష్ట్రం జహీరాబాద్‌కు చెందిన అమీర్ అనే వ్యక్తికి అమ్మడానికి తరలిస్తున్నట్లు వీరిరువురు అంగీకరించారని, ఇందులో ముఖ్య నిందితుడైన శివశంకర్‌రెడ్డి మూడు కేసుల్లో ఉన్నాడని, అయిన అతడిలో మార్పురాకపోవడంతో అతనిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారి నుండి రెండు సెల్‌పోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 18మందిపై పీడియాక్టు నమోదు చేసినట్లు తెలిపారు.