Thursday, November 21, 2024

జూవెల్లరీ షాపు రాబరీ నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః జూవెల్లరీ షాపు రాబరీ కేసును పోలీసులు 16 గంటల్లో చేధించారు. బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 330.84గ్రాముల బంగారు ఆభరణాలు, 124.19 గ్రాముల వెండివస్తువులు, మూడు బైక్‌లు, రెండు మొబైల్ ఫోన్లు, ఫేస్‌మాస్‌కలు రెండు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.24లక్షలు ఉంటుంది. సౌత్‌ఈస్ట్‌జోన్ డిసిపి తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, ముంబాయికి చెందిన నిజాం అజీజ్ కొటాడియా, హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం, ఈస్సిపూర్‌కు చెందిన శౌకత్ రైనీ అలియాస్ డిఎండిఎం, వారీస్ ఇద్దరు కలిసి జీడిమెట్లలో ఉంటూ ర్యాపిడో రైడర్లుగా పనిచేస్తున్నారు. రాబరీ కేసులో ప్రధాన నిందితుడు నిజాం అజీజ్ మలక్‌పేట, అక్బర్‌బాగ్‌లోని కిస్వా జూవెల్లరీలో రాబరీ చేసేందుకు ప్లాన్ వేశాడు. దానికి అనుగుణంగా ఐదు రోజుల క్రితం షాపులోకి కస్టమర్ వలే వెళ్లి అన్ని పరిశీలించాడు.

15 నిమిషాలు షాపులో ఉండి పరిశీలించాడు, కౌంటర్‌లో ఒక వ్యక్తి ఉండడం చూశాడు, అన్ని పరిశీలించిన తర్వాత బయటికి వచ్చాడు. షాపుకు సంబంధించిన అన్ని వివరాలను మిగతా ఇద్దరికి చెప్పాడు. మళ్లీ నిజాం అజీజ్ రెండోసారి మిగతా ఇద్దరు నిందితులను షాపుకు కొద్ది దూరంలో ఉంచి కస్టమర్ వలే వెళ్లి షాపును మొత్తం పరిశీలించాడు. తర్వాత నిందితులు రాబరీ చేయాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 13న జూవెల్లరీ షాపుకు వెళ్లిన నిజాం అజీజ్, షౌకత్ రైనీ, వారీస్ కలిసి రాబరీ కోసం ప్రయత్నం చేశారు. కానీ షాపులో చాలామంది కస్టమర్లు ఉండడంతో దోచుకోవడం సాధ్యం కాలేదు. దీంతో ముగ్గురు నిందితులు షాపు నుంచి తిరిగి వచ్చారు. మళ్లీ 14వ తేదీన మధ్యాహ్నం 1.20 గంటలకు వెళ్లిన నిందితులు జూవెల్లరీ షాపు యజమాని కుమారుడిని కత్తితో గాయపర్చి షాపులోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దోచుకుని వెళ్లారు. ఇన్స్‌స్పెక్టర్లు ప్రకాష్ రెడ్డి, సంజీవ్, ఎస్సైలు సాయిరామ్, అనంతచారి, పిసిలు ఎండి ఇమ్రాన్, శ్రీకాంత్, నయిం ఖాన్, అభిషేక్, యూసుఫ్, శుభాకాంత్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

16 గంటల్లో పట్టుకున్నారు…
రాబరీ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో నిందితులు చోరీ చేసిన తర్వాత పారిపోయేందుకు బైక్, ఆటోలను కిరాయికి తీసుకున్నట్లు గుర్తించారు. వాటిని జూవెల్లరీకి సమీపంలో నిలిపి ఉన్నట్లు గుర్తించారు. దాని ఆధారంగా సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా రాబరీ చేసిన తర్వాత నిందితులు మూడు ఆటోల్లో వెళ్లిపోయారు. తర్వాత ముగ్గురు అబిడ్స్ మీదుగా ప్రధాన నిందితుడు నిజాం అజీజ్ ఇంటికి చేరుకున్నట్లు గుర్తించారు. వాహనాల నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News