Sunday, January 19, 2025

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను మాదాపూర్ ఎస్‌ఓటి, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 21.788 గ్రాముల ఎండిఎంఏ, 874.316 గ్రాముల గంజాయి, కారు, మూడు మొబైల్ ఫోన్లు, రెండు వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి డాక్టర్ వినీత్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, కొండాపూర్‌కు చెందిన మారం పవన్‌కుమార్ అలియాస్ మాచా పవన్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆదర్శ్ కుమార్ సింగ్ కొండాపూర్‌లో ఉంటూ జోమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

మరో ఇద్దరు నిందితులు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. నలుగురు నిందితులు జల్సాలకు అలవాటుపడ్డారు, డ్రగ్స్, గంజాయి తరచూ తీసుకునేవారు. వాటిని కొనుగోలు చేసేందుకు నిందితుల వద్ద డబ్బులు లేకపోవడంతో గంజాయి, డ్రగ్స్ విక్రయించాలని ప్లాన్ వేశారు. నిందితులు డ్రగ్స్ గ్రాముకు రూ.1,000లకు కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి గ్రాముకు రూ.6,000,7,000లకు విక్రయిస్తున్నారు. ఎండిఎంఏ, గంజాయిని అవసరం ఉన్న వారికి నిందితులు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్, ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ తదితరులు నిందితులను పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News