Monday, January 20, 2025

రాఖీ సావంత్ భర్తను అరెస్టు చేసిన పోలీసులు!

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన భర్త ఆదిల్ ఖాన్ దుర్రానీపై కేసు పెట్టింది. పేరు పొందడానికి తనను వాడుకున్నాడని, మోసగించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు బాగా పెరిగిపోయాయి. రాఖీ ఫిర్యాదుపై ఒశివరా పోలీసులు మంగళవారం ఆదిల్ ఖాన్ దుర్రానీని అరెస్టు చేశారు. తాజా ఫిర్యాదులో రాఖీ అతడికి వివాహేతర సంబంధాలున్నాయని, బిగ్ బాస్ 4(మరాఠి)కి వెళ్లే ముందు తన తల్లి సర్జరీకి తానిచ్చిన రూ. 10 లక్షల చెక్కును కూడా అతడు చెల్లించలేదని పేర్కొంది.

ఆదిల్ తనతో సంబంధం తెంపుకున్నట్లు తెలిపాడని, తన గర్ల్‌ఫ్రెండ్ తనూతో కలిసి ఉంటున్నాడని కూడా రాఖీ తన ఫిర్యాదులో పేర్కొంది. తాను తన భర్తను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని, కానీ అతడిని క్షమించబోనని ఆమె విలేకరులకు తెలిపింది. రాఖీ తన భర్తను క్షమించబోనందున వారిద్దరి మధ్య న్యాయపోరాటం తప్పదని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News