Monday, January 20, 2025

ఆటోల దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వ్యసనాలకు బానిసగా మారి ఆటోలు చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి వద్ద నుంచి రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…యూసుఫ్‌గూడ, జవహర్‌నగర్‌కు చెందిన మండొళ్లు రాజు ఆటోడ్రైవర్, రెహ్మత్‌నగర్‌కు చెందిన సాయిప్రసాద్ ఇద్దరు కలిసి ఆటోలు చోరీ చేస్తున్నారు. ఏడోతరగతి వరకు చదువుకున్న రాజు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే వ్యసనాలకు బానిసగా మారాడు.

తన స్నేహితుడితో కలిసి రోజు తాగేవాడు. వచ్చే డబ్బులు మద్యానికి, కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో ఇద్దరు కలిసి ఆటోలు చోరీ చేసి విక్రయించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఆటోలను చోరీ చేశారు. చోరీ కేసుల వివరాలు తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. రాజును అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ ఖలీల్‌పాషా, ఎస్సై రంజిత్‌కుమార్ పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News