Friday, January 24, 2025

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్జాతీయ డ్రగ్స్ సప్లయ్ దారులను రాచకొండ మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. అ రెస్టు అయిన వారి వద్ద నుంచి 9 కోట్ల రూపాయల విలువైన 8.5 కిలోల సూడో ఎపిడ్రిన్, రూ. 4,02,500 నగదు, ఐదు పాస్ పోర్టులు, మూడు ఆధార్ కార్డులు, రెండు ఓటర్ ఐడిలు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. త మిళనాడుకు చెందిన మహ్మద్ కాసిం, రసూల్‌ఉద్దిన్, ఫరీద్, ఫైసల్ రహీం కలిసి డ్రగ్స్‌ను హైదరాబాద్, పూణే నుంచి విదేశాలకు కొరియర్ ద్వారా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు.

ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసుల ద్వారా రెండు నగరాలకు నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు డ్రగ్స్ పంపిస్తున్నా రు. ఈ ఏడాది నిందితులు విదేశాలకు 70 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్స్‌ను పంపించారు. డ్రగ్స్‌ను క్లాత్‌బాక్స్, బ్యాంగిల్ బాక్స్‌లు, బేబీ గిఫ్ట్ తదితరాల ద్వారా ఇక్కడి తప్పుడు చిరునామాలతో పంపిస్తున్నారు. ఇద్దరు నిందితులు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ కొరియర్ ద్వారా పంపించేందుకు నగరానికి రాగా విషయం నాచారం, మ ల్కాజ్‌గిరి పోలీసులకు తెలిసింది. వెంటనే నిందితులను అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, రాములు, ఎస్సైలు వాసుదేవ్, రఘురాముడు, సారంగపాణి తదితరులు పట్టుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇన్నర్‌లేయర్‌లో డ్రగ్స్..
డ్రగ్స్‌ను నిందితులు క్లాత్ బాక్స్‌లు, బ్యాంగిల్స్ బాక్స్‌ల్లోని లోపలి భాగంలో 200 గ్రాముల ప్లాస్టిక్ కవర్స్‌లో పెట్టి సూడో ఎపిడ్రిన్ డ్రగ్స్‌ను కొరియర్స్ ద్వారా పంపిస్తున్నారు. దీనికి హైదరాబాద్‌లోని జివిఆర్ ఇంటర్నేషనల్ సర్వీస్, ఇండోఫిన్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ పూణే ద్వారా ఇప్పటి వరకు 70 కిలోల సూడో ఎపిడ్రిన్ డ్రగ్స్‌ను పంపించారు. హైదరాబాద్ నుంచి ఎనిమిది సార్లు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్ని, కాన్‌బెర్రా, సౌత్‌వెల్స్ ప్రాంతాలకు పంపించారు.
ముఠాను కలిపింది గూడ్స్ వ్యాపారం
తమిళనాడుకు చెందిన మహ్మద్ ఖాసిం ఎం బిఏ చేసిన తర్వాత మలేషియా, దుబాయ్‌కి వెళ్లి అక్కడ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, యూఎస్‌బి చిప్‌లు కొనుగోలు చేసి ఇండియాలో విక్రయించేవాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న రహీంతో పరిచయం ఏర్పడింది. రహీం తన క్లాస్‌మేట్ రసూలుద్దిన్‌ను ఖాసీంకు పరిచయం చేశాడు. రసూలుద్దిన్ అప్పటికే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నా డు. రసూలుద్దిన్ గతంలో ఖాసీం మలేషియా, దుబాయ్ నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువులు తెచ్చి ఇక్కడ విక్రయించేవా డు. రసూలుద్దిన్‌కు తన క్లాస్‌మేట్ ఇబ్రహింను 2013 లో కలిశాడు. ఇబ్రహిం తాను ఇచ్చిన సూట్ కేసు మలేషియా లో అప్పగిస్తే లక్ష రూపాయలు ఇస్తానని రసూలుద్దిన్‌కు చె ప్పాడు. దానిని తీసుకుని మలేషియా బయలు దేరిన రసూలుద్దిన్‌ను మధురై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు అయి కొన్ని రోజుల తరువాత బయటకు వచ్చాడు.

ఈ విధంగా అందరూ కలిసి స్థానికుల ఆధార్ కార్డు, పాన్‌కార్డును ఉపయోగించి డ్రగ్స్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ విదేశాలకు చేరే వరకు నిందితులు మానిటరింగ్ చేసేవారు. వీరు పూణేకు చెందిన ఫరీద్, ఫైసల్ సాయంతో డ్రగ్స్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం రహీం ద్వారా తన వద్దకు వచ్చిన డ్రగ్స్‌ను విదేశాలకు పంపించేందుకు ఖాసిం బస్సు ద్వారా హైదరాబాద్‌కు వచ్చి లాడ్జిలో బస చేశాడు. ఒకసారి డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా విదేశాలకు సరఫరా చేస్తే ఖాసింకు రహీం లక్ష రూపాయలు ఇచ్చేవాడు. ఎక్కువగా డబ్బులు వస్తుండడంతో ఖాసిం గత కొంత కాలం నుంచి డ్రగ్స్‌ను అంతర్జాతీయి కొరియర్స్ ద్వారా పంపిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News