Monday, January 20, 2025

గేమింగ్ అడ్డాపై పోలీసుల దాడి… లేడీ డాన్ తో పాటు 9 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: హైదరాబాద్ లో గేమింగ్ స్థావరాన్ని మాదాపూర్ ఎస్ఒటి బృందం గుట్టు రట్టు చేసింది.  ఖాజాగూడలో లేడి డాన్ మాధవి నిర్వహిస్తున్న గేమింగ్ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. గేమింగ్ ఆడుతున్న 9 మంది అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి 62 వేల నగదు, 11 మొబైల్ ఫోన్లు, 5 సెట్స్ ప్లేయింగ్ కార్డ్స్ సీజ్ చేశారు. గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో వ్యాపారస్తులే టార్గెట్ చేసుకొని ఆమె గేమింగ్ నడుపుతోంది. వ్యాపారస్తులకు లేడి కిలాడీ వల వేసి గేమింగ్ ఆటలోకి దింపుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు మూడు ముక్కలాట గేమింగ్ రన్ చేస్తోంది. ఒక్కొక్క ఆట కు వేయి రూపాయలు వసూలు చేయడంతో వ్యాపారస్తులు లక్షలు పోగొట్టుకుంటున్నారు. గేమింగ్ తో పాటు ఆట, పాటతో వ్యాపారస్తులను మత్తులో ముంచుతుందని పోలీసులు వెల్లడించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News