Monday, December 23, 2024

హుక్కా పార్లర్ పై పోలీసుల దాడి.. బిగ్‏బాస్ విన్నర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ముంబై పోలీసులు బోరా బజార్ ఏరియలో మంగళవారం రాత్రి 10.30 గంటలకు ప్రముఖ హోటల్ లోని హుక్కా పార్లర్పై దాడి చేశారు. దాడి సమయంలో ‘బిగ్ బాస్’ విజేత మున్నవర్ ఫారూఖీతో పాటు, మరి పదమూడు మంది అక్కడే హుక్కా సేవిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ‘బిగ్ బాస్ 17’ విజేత,  స్టాండప్ కమెడియన్ మున్నావర్ ఫరూఖీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హుక్కా బార్ పై దాడి చేసిన పోలీసులు.. అక్కడే మున్నావర్ ఫరూఖీని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అతడితోపాటు మరో 13 మందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

హెర్బల్ హుక్కా తాగే ముసుగులో పార్లర్ లోని కొందరు నిర్వాహకులు పొగాకు ఆధారిత హుక్కా సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సోదాలో 4400 రూపాయల నగదు, 9 హుక్కా పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొత్తం 17 వేల 900 రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎంఆర్‌ఏ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పొగాకు ఉత్పత్తుల చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 283 (ప్రజా మార్గంలో లేదా నావిగేషన్ లైన్‌లో ప్రమాదం లేదా అడ్డంకి), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం) కింద కేసులు నమోదైనట్లు అధికారి తెలిపారు.

హెర్బల్ హుక్కా తాగే ముసుగులో పార్లర్ లోని కొందరు నిర్వాహకులు పోగాకు ఆధారిత హుక్కా సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సోదాలో 4400 రూపాయల నగదు, 9 హుక్కా పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొత్తం 17 వేల 900 రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎంఆర్‌ఏ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పొగాకు ఉత్పత్తుల చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 283 (ప్రజా మార్గంలో లేదా నావిగేషన్ లైన్‌లో ప్రమాదం లేదా అడ్డంకి), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం) కింద కేసులు నమోదైనట్లు అధికారి తెలిపారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News