Monday, January 20, 2025

గచ్చిబౌలీలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం రాత్రి పిఎస్ పరిధిలోని టీఎన్జీఎస్ కాలనీలో బర్త్ డే పార్టీలో గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. బర్తడే పార్టీలో గంజాయిని విక్రయిస్తున్న 18 మంది యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలువురు సినీ రంగానికి చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం

నిందితుల నుంచి గంజాయి ప్యాకేట్లు, సిగిరెట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నింధితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు. 18 మందికి 41 నోటీసులు ఇస్తామని తెలిపిన గచ్చిబౌలి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News